పంక్చర్ షాపును కూడా వదలడం లేదు సీఎం జగన్ దండుపాళ్యం గ్యాంగ్

Thursday, January 7th, 2021, 01:25:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై మరొకసారి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంక్చర్ షాపును కూడా వదలడం లేదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ అంటూ నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా, పెనుగొండ నియోజక వర్గం, సోమందేపల్లి మండల కేంద్రం లో పంక్చర్ షాపు జీవనాధారం గా బ్రతుకుతున్న కాలాచారి కుటుంబాన్ని వైసీపీ నాయకులు వేదించడం దారుణం అంటూ నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి జీవనాధారమైన షాపును తొలగించాలని పోలీసులు ఒత్తిడి చేయడం వలనే కాలాచారీ ఆత్మహత్యకి యత్నించాడు అని నారా లోకేష్ పేర్కొన్నారు. అయితే వైసీపీ రౌడీలతో కొంతమంది కుమ్మక్కై సామాన్యులను హింసించడం మంచి పరిణామం కాదు అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి చర్యలకు పాల్పడితే జగన్ రెడ్డి ప్రజా గ్రహానికి గురికాక తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.