నీ ప్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకొక తప్పదు – నారా లోకేష్

Wednesday, December 30th, 2020, 08:33:37 AM IST

Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం జగన్ అంటూ నారా లోకేష్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తపాతం పారిస్తున్నావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు అని, నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ నారా లోకేష్ హెచ్చరించారు.

చేనేత వర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు అంటూ నారా లోకేష్ అన్నారు. అయితే మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్ష కట్టి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ను ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసిన ఎమ్మెల్యే, అతని బావ బంగారు రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. వేట కొడవళ్ళతో తండ్రిని నరికించావ్, నువ్విచ్చే పరిహారం తో అనాథలై న ఆ పిల్లలకు తండ్రిని తేగలవా జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.