సీఎం జగన్ తీరు పై నారా లోకేష్ అసహనం

Tuesday, November 3rd, 2020, 10:34:00 AM IST

Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల జరుగుతున్న ఘటన ల పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తున్నారు. ఈ మేరకు మరోమారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. విశాఖ మన్యం లో యువతి పై అత్యాచారం ఘటన పై నారా లోకేష్ స్పందించారు. అరకు పోలీస్ స్టేషన్ వద్ద గిరిజనులు చేస్తున్న ఆందోళన ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే మహిళలకి ఇదేనా రాష్ట్రం లో కల్పించే భద్రత, ఇదేనా మహిళలకి రాష్ట్రం లో కల్పించే రక్షణ అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, పబ్లిసిటీ పిచ్చి తగ్గించుకొని మహిళలకు రక్షణ కల్పించండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళలకి ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ ప్రాంతం కాదు అంటూ ట్యాగ్ ను జత చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దిశ చట్టం అమలు పై పరోక్షంగా నారా లోకేష్ విమర్శలు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ లు ఉన్నా ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం పట్ల మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు నారా లోకేష్.