రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వారిని వెంటనే ఆదుకోవాలి

Friday, October 23rd, 2020, 02:17:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ వర్షాల కారణంగా ఎక్కువగా నష్ట పోయింది రైతులే అని చెప్పాలి. చేతికొచ్చిన పంట కాస్తా వరదలో కలిసిపోవడం తో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు నారా లోకేష్ పలు ప్రాంతాల్లో పర్యటించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈరోజో రేపో చేతికి అందుతుందనుకున్న పంట అకాల వర్షాలతో అందకుండా పోయిన దుఖం లో ఉన్న రైతుకు భరోసా అందించేందుకు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నారా లోకేష్. గుంతకల్లు నియోజక వర్గం కడిరికొండ గ్రామంలో పొలాల్లోనే కుళ్లిపోయిన వరుస పంటను చూస్తే బాధేస్తుంది అని తెలిపారు.

తాడిపత్రి నియోజక వర్గం మిడుతురు గ్రామంలో పత్తిపంట నీట మునిగి రైతును కోలుకోలేని దెబ్బతీసింది అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. ఏ రైతు కంట చూసినా కన్నీరే అని, స్థితిలో ఉన్న రైతును నివేదికలు, నిధులు అంటూ కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని తెలిపారు.