అమరావతిని పాకిస్తాన్ బోర్డర్‌లా మార్చారు – నారా లోకేశ్

Tuesday, January 14th, 2020, 06:16:05 PM IST

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసనలు 28వ రోజుకు చేరుకున్నాయ్. అయితే రైతుల నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు ఏపీ రాజధానిలో భారీ మోహరించారు. అంతేకాదు పలు గ్రామాలలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.

అయితే దీనిపై స్పందించిన నారా లోకేశ్ అమరావతి ప్రాంతంలో యుద్ధవాతావరణం తీసుకొచ్చి, జగన్ గారు మాత్రం పండుగ చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండకూడదా? పొలాల్లో ముళ్ల కంచెలు వేస్తారా అని ప్రశ్నించారు. అమరావతి గ్రామాలను పాకిస్తాన్ బోర్డర్ ని తలపించే విధంగా మార్చేసారు. ఎంత దారుణం? వైకాపా ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల్లా చూస్తోంది. ముళ్ల కంచెలు, పోలీసు లాఠీలతో దమనకాండ ఆపాలని డిమాండ్ చేశారు.