అంబేద్కర్ గారిని అవమానిస్తుంది వైసీపీ ప్రభుత్వం

Sunday, January 31st, 2021, 04:34:09 PM IST

Lokesh

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి వైసీపీ ప్రభుత్వం తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం తో పాటు 20 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్దం చేసింది నాటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. నేడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతినిత్యం అంబేద్కర్ గారిని అవమానిస్తుంది వైసీపీ ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.

అయితే ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జరిగిన ఒక సంఘటన గురించి నారా లోకేష్ ప్రస్తావించారు. చింతలపూడి లో బడుగు బలహీన వర్గాలకు స్వేచ్చా వాయువులు పంచిన అంబేద్కర్ గారి విగ్రహానికి దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు అని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ నారా లోకేష్ అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు వైసీపీ తీరు పై అసహనం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.