చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు – నారా లోకేష్

Tuesday, March 16th, 2021, 02:07:40 PM IST

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని నమ్మించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి కి ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లూ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. 21 నెలలు శోధించి అలిసి పోయి ఆఖరుకు రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు తో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థతికి దిగజారారు అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సిల్లీ కేసులతో చంద్రబాబు గారు గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ను అంతం చేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవ భూమి తనను తానే కాపాడుకుంటుంది అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పై కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కి చెందిన అభిమానులు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కి సీఐడీ నోటీసులు జారీ చేయడం పట్ల టీడీపీ నేతలు అధికార పార్టీ వైసీపీ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.