అలా చేయడం ఓ విజయమేనా? – నారా లోకేష్

Sunday, February 14th, 2021, 06:47:18 PM IST

Lokesh

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి వైసీపీ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ లోని అగ్ర నేతల నియోజక వర్గాల పరిధి లో తెలుగు దేశం పార్టీ విజయం సాధించింది అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీ కి చెందిన కార్యకర్త నుండి కార్యదర్శి వరకూ వెన్ను చూపని పోరాటం తో ఎన్నికల్లో పట్టు సాధించాం అని మీడియా సమావేశం లో తెలిపారు. అయితే బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో ఏక గ్రీవాలు చేసుకోవడం, చంపేస్తాం అని హెచ్చరించి నామినేషన్లు ఉపసంహరించు కొనేలా చేయడం ఓ విజయమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే జనం ఇంకా కూడా వైసీపీ వైపే ఉన్నారు అనే నమ్మకం ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా మూడు మరియు నాలుగో విడతల్లో పోటీ చేయాలని సూచించారు. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది అంటూ సవాల్ విసిరారు నారా లోకేష్. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు.