శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకు రాజకీయాలతో పనేంటి – నారా లోకేశ్

Saturday, January 30th, 2021, 12:01:27 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల పర్వం మొదలుకావడంతో వాడీవేడీగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌ని గెలిపించడానికి కొంతమంది పోలీసులు పూర్తిగా దిగజారి పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకు అసలు రాజకీయాలతో పనేంటని ప్రశ్నించారు.

అయితే గుంటూరు జిల్లా, పేటేరు గ్రామంలో పోలీసులే ఏకగ్రీవం చెయ్యాలంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగడం రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని అన్నారు. అయితే ఐపిసిని తుంగలో తొక్కి జగన్ పీన‌ల్ కోడ్ అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు ఉద్యోగాల‌కు రిజైన్ చేసి వైసీపీ కండువా క‌ప్పుకోండని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.