పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు – నారా లోకేశ్

Friday, February 26th, 2021, 06:12:20 PM IST

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే తమ మేనిఫేస్టోపై ట్విట్టర్ ద్వారా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు అంటూ పట్టణ ప్రజలను ఉద్దేశించి అన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసామని, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నానని అన్నారు.

అయితే పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని, 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యమని, కనీసం రోడ్డు పై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూసామని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడు, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తాడు. ఆలోచించి ఓటు వెయ్యండి అని పట్టణ ప్రజలకు సూచించారు.