పోలీసు వాహనాలకు వైకాపా రంగులా.. నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Monday, December 21st, 2020, 03:47:05 PM IST

ఏపీ సీఎం జగన్ జన్మదినోత్సవాలలో భాగంగా నేడు దిశ పేరుతో మహిళా పోలీసులకు స్కూటీలు అందచేశారు. అయితే వాటికి వైసీపీ రంగులు వేయడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తప్పుపట్టారు. పోలీసు వాహనాలకు వైకాపా రంగులా! పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారని, కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు.

అయితే రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకి రాగలుగుతారని అన్నారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిదని సూచించారు.