జగన్ ది విష ప్రచారం తప్ప విషయం లేదని తేలిపోయింది

Wednesday, January 20th, 2021, 03:25:25 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జై అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భం గా ఉద్యమ కారులందరికి ఉద్యమాభివందనాలు అంటూ నారా లోకేష్ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని నినదిస్తూ రైతులు, మహిళలు, యువత ఆదర్శంగా నిలిచారు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే అమరావతి పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది విష ప్రచారం తప్ప విషయం లేదని తేలిపోయింది అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ ఉద్యమం లో అంతిమ విజయం రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులదే అంటూ చెప్పుకొచ్చారు. అయితే అమరావతి ఉద్యమం కి పలువురు ప్రముఖులు మద్దతు ఇస్తుండగా, వైసీపీ నేతలు పలువురు దీని పై విమర్శలు చేస్తున్నారు.