కంపెనీలు అన్నీ జగన్‌కి బైబై చెప్పేస్తున్నాయి – నారా లోకేశ్

Sunday, January 10th, 2021, 03:10:25 AM IST

Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కంపెనీలు అన్నీ జగన్‌కి బైబై చెప్పేస్తున్నాయి. విధ్వంసం, వైకాపా నాయకుల బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారు, కంపెనీలు ఏర్పాటు చేసిన వారు భయంతో పారిపోతున్నారని, జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదు పైగా ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని అన్నారు.

అంతేకాదు జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని, విశాఖలో పదిహేనేళ్ల క్రితం ఏర్పాటై 2 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ ఎస్ బి సి కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నారా లోకేశ్ మండిపడ్డారు.