నీ బతుకు ఫేక్…నీ పార్టీ ఫేక్ – నారా లోకేష్

Saturday, January 2nd, 2021, 01:29:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ 1 క్రిమినల్ సీఎం, తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ 2 దొంగరెడ్డి తో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు అంటూ నారా లోకేష్ అన్నారు. నీ బతుకు ఫేక్, నీ పార్టీ ఫేక్, నీ హామీలు ఫేక్, నీ పాలన ఫేక్, చివరికి నా పై నీ దొంగల బ్యాచ్ తో చేయించే ఆరోపణలు ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నాళ్లీ దొంగలతో దొంగ ఆరోపణలు జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. అయితే నువ్వు నాపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చేయడానికి నేను సిద్దం, నువ్వు సిద్దమా అంటూ నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు. వైసీపీ నేతలు నారా లోకేష్ పై వరుస విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ సీఎం జగన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.