న్యాయం జరగకపోతే మళ్ళీ ప్రొద్దుటూరు వస్తా – నారా లోకేష్

Thursday, December 31st, 2020, 02:38:32 PM IST

Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం కి వరుస మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నందం సుబ్బయ్య హత్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ కి చెందిన వ్యక్తి పై ఇలా జరగడం పట్ల ఇటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సుబ్బయ్య అంతిమ యాత్ర లో నారా లోకేష్ పాల్గొని నివాళులు అర్పించారు. అయితే బాధిత కుటుంబాన్ని ప్రలోభ పెట్టినా, వారికి ఏం జరిగినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే బాధ్యత అంటూ నారా లోకేష్ అన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన హామీ మేరకు న్యాయం జరగక పోతే మళ్లీ వస్తా, దీక్ష కి దిగుతా అంటూ నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.