రైతు రాజ్యం తెస్తానన్న జగన్ రైతు లేని రాజ్యం తీసుకొస్తున్నాడు – నారా లోకేశ్

Friday, December 11th, 2020, 12:00:43 AM IST

Nara_Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు తెలుగు రైతు విభాగం పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన నారా లోకేశ్ కొత్తగా ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.

అయితే రైతు రాజ్యం తెస్తా అన్న జగన్ రైతు లేని రాజ్యం తీసుకొస్తున్నాడని మండిపడ్డారు. వరుస తుఫాన్లు, అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని, నష్ట పరిహారం అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రైతులకు న్యాయం జరిగేవరకు తెలుగు రైతు విభాగం వారి తరపున పోరాడుతుందని అన్నారు.