రైతు నీళ్లలో ఉంటే జగన్ ఆకాశంలో విహరిస్తున్నారు – నారా లోకేష్

Friday, October 16th, 2020, 05:54:00 PM IST

శుక్రవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరీ, తెనాలి, వేమూరు నియోజక వర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తూ, రైతుల కష్టాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు అని, రైతు నీళ్ళల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆకాశంలో విహరిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

అంతేకాక రైతులకు పోయిన సంవత్సరం నష్ట పరిహారం ఇంకా అందలేదు అని నారా లోకేష్ విమర్శించారు. అయితే ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా కూడా జరగడం లేదు అని, వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో రైతుల పక్షాన టీడీపీ పోరాటం సాగిస్తుంది అని నారా లోకేష్ అన్నారు. అంతేకాక చిట్ట చివరి రైతుకి న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటాం అని నారా లోకేష్ హామీ ఇచ్చారు.