తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రం లో మెట్ట రైతుల కంట కన్నీరు వరద ప్రవహిస్తుంది అని, అధిక వర్షాలకు పత్తి, వేరు శనగ, మిర్చి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు బాగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్టపోయారు అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రిజర్వు బ్యాంకు ఖజానా ఖాళీ అయ్యేంతగా అప్పులు దూసి తెస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులకు రూపాయి కూడా సాయం చేసింది లేదు అని తెలిపారు. ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేసుకుంటున్నారు అని నారా లోకేష్ విమర్శించారు.
అయితే తీసుకొస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎటు పోతున్నాయో రైతులకు తెలియడం లేదు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆడుకోండి అని నారా లోకేష్ అన్నారు. వాళ్ళ కష్టాలు కాస్త ఆలకించండి ముఖ్యమంత్రి గారూ అంటూ నారా లోకేష్ అన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
తీసుకొస్తున్న వేల కోట్ల అప్పులు ఎటుపోతున్నాయో రైతులకు తెలియడం లేదు. ఇప్పటికయినా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోండి. వాళ్ళ కష్టాలు కాస్త ఆలకించండి ముఖ్యమంత్రి గారూ!! (3/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020