జగన్ గారు మీ మనసు కరగడం లేదా – నారా లోకేశ్

Saturday, October 10th, 2020, 11:30:17 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దాదాపు 300 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొందరైతే రాజధాని తరలిపోతుందన్న బాధతో గుండె పోటు వచ్చి మరణిస్తున్నారు. రాజధాని తరలిపోతుందన్న బెంగతో నేడు ఒక్కరోజే ఇద్దరు రైతులు మరణించారు.

అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారని, రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా జగన్ గారి మనస్సు కరగడం లేదని అన్నారు. జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమని, కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంకా శివరామ కృష్ణ గారు, ఉద్దండరాయుని పాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజర్ గారు మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాను. మూడు రాజధానుల మూర్ఖపు ఆలోచన మానుకొని ఉన్న అమరావతిని అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.