కోడికత్తి జగన్ రెడ్డి, తాపికత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరు – నారా లోకేష్

Thursday, March 11th, 2021, 11:40:03 AM IST

కొల్లు రవీంద్ర అరెస్ట్ వ్యవహారం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. సౌమ్యుడు, వివాద రహితుడు అయిన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంచి సీఎం రాష్ట్ర అభివృద్ది తో ఆనందాన్ని పొందుతాడు అని,మూర్ఖపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నాయకులను అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతాడు అని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కోడి కత్తి జగన్ రెడ్డి, టాపికత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరు అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీరు ఎంత అనిచినా ఉప్పెనలా టీడీపీ సైన్యం మీ పై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అధికార మదం తో వైసీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది ఆధికారులు జగన్ రెడ్డి తో కలిసి చిప్పకూడు తినడానికి సిద్దంగా ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ వ్యవహారం పట్ల టీడీపీ నేతలు అధికార పార్టీ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.