అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ – నారా లోకేష్

Sunday, February 28th, 2021, 04:19:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరపున మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్దులు లేక టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బులుగు కండువాలు కప్పారు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పలాస, రాయదుర్గం తో పాటు రాష్ట్రమంతా పోటీ కి అభ్యర్దులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారు అని భయం అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్దులకి జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పంచాయతి ఎన్నికలు పీక మీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు అంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే పురపాలక ఎన్నికల్లో గెలిచే తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను ముందుగానే పార్టీ లోకి చేర్చుకుంటున్నారు అని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వొక నాయకుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేదొక పార్టీ అంటూ సెటైర్స్ వేశారు. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ అంటూ నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. అయితే కొందరిని పార్టీ లోకి చేర్చుకోవడం పట్ల నారా లోకేష్ వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన పేపర్ న్యూస్ ను పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు టీడీపీ కి మద్దతు తెలుపుతూ వైసీపీ పై ఘాటు విమర్శలతో రెచ్చిపోతున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తీరును తప్పుబడుతున్నారు.