దళితుల పై వైఎస్ జగన్ దమనకాండ కొనసాగుతూనే ఉంది – నారా లోకేష్

Friday, February 19th, 2021, 11:52:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు పట్ల మరొకసారి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. దళితుల పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉంది అని అన్నారు. గుంటూరు జిల్లా, అమరావతి మండలం, లింగాపురం గ్రామంలో దళితుల పై వైసీపీ నాయకులు దాడి జగన్ రెడ్డి అహంకార పాలన కి అద్దం పడుతుంది అంటూ విమర్శలు గుప్పించారు. జాతి తక్కువ వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? నరికి చంపేస్తాం అంటూ బెదిరించి రాళ్లతో దళితుల పై దాడి చేయడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడం దారుణం అంటూ నారా లోకేష్ వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. కులం పేరుతో దూషించడం మాత్రమే కాకుండా, దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డ వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. లింగాపురం గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ కోరారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.