ఓటేసిన వాళ్లపై వేటేసే కేటుగాడు వైఎస్ జగన్ – నారా లోకేష్

Wednesday, February 17th, 2021, 02:42:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటేసిన వాళ్లపై వెటేసే కేటుగాడు వైఎస్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యం గా మార్చేసి ఎన్నికల్లో పోటీ చేయనివ్వడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. జనాన్ని ఓటు వేయనివ్వడం లేదు అంటూ ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ కి మద్దతు గా నిలిచారనే కక్ష తో తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు.

అయితే వైసీపీ నేతలు, వాలంటీర్ పెట్టిన హింస తో దంపతులు ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నారు అంటూ నారా లోకేష్ అన్నారు. ఎన్నికల కమిషన్ స్పందించి వీరి ప్రాణాలకు రక్షణ కల్పించాలి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అయితే 151 సీట్లు మరియు సంతలో పశువులు మాదిరి కొన్న నలుగురు ఉన్నా, ఇంకా పోటీకి భయమేనా అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లి కొంపలోంచి బయటికి వస్తే వలలు, పోలీసులు అడ్డంగా ఉండాలి నీకు అంటూ విమర్శలు చేశారు. మళ్ళీ ఢిల్లీ ను ఢీ కొడతాడు, మోడీ మెడలు వంచుతాడు, గాంధీ మళ్ళీ పుట్టాడు అంటూ ఎలివేషన్లు అంటూ సెటైర్స్ వేశారు.