ఫ్యాక్షన్ పంథాలో జగన్ ఓటమిని అంగీకరించారు – నారా లోకేశ్

Tuesday, February 16th, 2021, 07:00:03 PM IST

Nara_Lokesh

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అరాచకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫేక్ వెబ్ సైట్లు, 92 శాతం పంచాయతీలు మేమే గెలిచాం అంటూ వైసీపీ డాంబికాలు చెప్పుకుందని, ఎన్ని చేసినా వాస్తవం దాగదుగా అని అన్నారు.

అయితే వైకాపా నాయకుల చిల్లర పనులతో ఓటమిని వారే అంగీకరించారు. మా ఊరు కాదని కొందరు, ఓటు వెయ్యలేదని ఇల్లు,డ్రైనేజ్, మెట్లు పగలగొట్టడం, సంక్షేమ కార్యక్రమాలు కట్ చెయ్యడం, దాడులు చెయ్యడం చేశారని, ఆలస్యంగా అయినా ఫ్యాక్షన్ పంథాలో జగన్ ఓటమిని అంగీకరించారని ఇక 3,4 విడతల ఫలితాల తరువాత వైకాపా నేతల మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని లోకేశ్ అన్నారు.