పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే – నారా లోకేష్

Monday, February 15th, 2021, 02:12:24 PM IST

Jagan_Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కి, రియాలిటీ కి మధ్య తేడా ఇదే అంటూ ఒక సన్నివేశాన్ని వీడియో రూపం లో వెల్లడించారు. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యం అంటూ మాయ చేశారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డెలివరి అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూ లైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ డోర్ డెలివరి మాయలోడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనబడితే సన్నగడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మ లు క్యూ లో రెడీ గా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పలు పథకాల తో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పాలనా విధానం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అంతేకాక పంచాయితీ ఎన్నికల విషయం లో వైసీపీ నేతలు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు అని, పథకాల పట్ల నమ్మకం ఉంటే ఎందుకు ఇలా దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.