మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జగన్ – నారా లోకేష్

Friday, February 5th, 2021, 02:09:26 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జగన్ అంటూ నారా లోకేష్ విమర్శించారు. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారి పోయాడు అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైసీపీ గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది అంటూ చెప్పుకొచ్చారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు అని నారా లోకేష్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయల పల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైసీపీ గ్యాంగ్ ను కఠినంగా శిక్షించాలి అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే విగ్రహం ధ్వందానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నారా లోకేష్. అయితే నారా లోకేష్ వైసీపీ పై ఆరోపణలు చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ధ్వంసం తప్పే కానీ, వైసీపీ కి చెందిన వారే చేశారు అని ఎలా చెప్తావ్ అంటూ సూటిగా ప్రశ్నించారు.