పచ్చని గోదావరి జిల్లాలో ఫ్యాక్షనిజం మొదలెట్టాడు జగన్

Tuesday, February 2nd, 2021, 08:52:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చని గోదావరి జిల్లాలో ఫ్యాక్షనిజం మొదలెట్టాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోల్లలగుంట గ్రామంలో తెలుగు దేశం పార్టీ బలపరచిన సర్పంచి అభ్యర్ధి పుష్పవతి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారిని కిడ్నాప్ చేసి హత్య చేశారు వైసీపీ రౌడీలు అంటూ నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం పోలీస్ విచారణకు వెళ్లిన శ్రీనివాసరెడ్డి ను సాయంత్రానికి హత్య చేశారు అని, శాంతి భద్రతలను గాలికి వదిలేసిన జగన్ రెడ్డి భజన లో బిజీ గా ఉన్న డీజీపీ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల పాత్ర పై కూడా విచారణ జరపాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అయితే శ్రీనివాస్ రెడ్డి హత్య లో భాగస్వామ్యం అయిన పోలీసులు, వైసీపీ నాయకులు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.