మ‌రోసారి రాష్ట్రాన్ని ద‌గా చేశారు.. జగన్‌పై నారా లోకేశ్ సెటైర్లు..!

Monday, February 1st, 2021, 05:32:30 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. జ‌నాన్ని మోసంచేసే రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి రాష్ట్రాన్ని ద‌గా చేశారని, 25 మంది ఎంపీలని ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి మ‌రీ ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌లికి.. చివరికి తన 31 కేసుల నుంచి త‌ప్పిస్తే చాలు ప్ర‌త్యేక హోదా ఊసెత్త‌న‌ని 28 ఎంపీల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టారని అన్నారు.

అయితే విభ‌జ‌న ‌చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి రావాల్సిన హామీల‌కు బాబాయ్ హ‌త్య కేసుతో చెల్లు చేసింది కేంద్రం. బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌క్క‌ర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను త‌న‌కు కేటాయిస్తే చాల‌ని జగన్ కేంద్రం వ‌ద్ద సాగిల‌ప‌డ్డారని, అప్పులు వాడుకోవ‌డానికి అనుమ‌తిస్తే చాలు.. ఏ ప్రాజెక్టులివ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని ఒప్పందం చేసుకున్నారు. బ‌డ్జెట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వ‌ని కేంద్రాన్ని ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.