ఏపీ లో ఐపిసి లేదు…జేపిసి మాత్రమే ఉంది – నారా లోకేష్

Friday, January 29th, 2021, 03:15:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఐపిసి లేదు అని, జగన్ పీనల్ కోడ్ మాత్రమే ఉంది అంటూ నారా లోకేష్ విమర్శించారు. ప్రజల తరపున పోరాడే వ్యక్తుల పై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జైలు నుండి బయటకి వచ్చేపుడు జగన్ తలదించుకుని వచ్చారు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే జీఓ 77 వలన మూడు లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగింది అని, 13 యూనివర్సిటీ లలో 11 చోట్ల విసి లు జగన్ సామాజిక వర్గం కి చెందిన వారే ఉన్నారు అంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపం గా మారిన జీఓ నంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేయడమే టి ఎన్ ఎస్ ఎఫ్ నేతలు చేసిన నేరమా అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ రెడ్డి నీ రేప్ చేయడానికి వచ్చారు అని కేసు పెట్టారు, టి ఎన్ ఎస్ ఎఫ్ నేతలు అంటే ఎందుకు అంత భయం జగన్ అంటూ నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు.