వైసీపీ ఎమ్మెల్యే ల దోపిడీ ఏ రేంజ్ లో ఇది చూస్తే ఉందో అర్థం చేసుకోవచ్చు!

Thursday, July 16th, 2020, 08:31:58 PM IST


తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరోమారు అధికార పార్టీ ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది అంటూ అందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలతో షేర్ చేశారు. మంత్రి అనుచరులు, మంత్రి స్టికర్ ఉన్న కారు లో 5.27 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డారు అని వ్యాఖ్యానించారు.

అయితే ఇతర రాష్ట్రాల కు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైసీపీ ఎమ్మెల్యే ల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకొనే దమ్ముందా అంటూ నిలదీశారు. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చంసనీయం గా ఉన్నాయి. వీటి పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.