జగన్ అరాచక పాలనలో వారికి రక్షణ లేకుండా పోయింది

Thursday, January 28th, 2021, 12:51:09 PM IST

Jagan_Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ పాలనా విధానం పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు లో అక్రమ గ్రావెల్ తరలింపు ను అడ్డుకున్న విఆర్ఓ హనుమంత రావు గారు పై వైసీపీ నాయకుడు కోటేశ్వర రావు మరియు అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగస్తులకు, ప్రజలకి రక్షణ లేకుండా పోయింది అంటూ నారా లోకేష్ విమర్శించారు.

అయితే గూడూరు లో అక్రమ గ్రావెల్ మైనింగ్ వెనుక ఉన్న వైసీపీ ముఖ్య నాయకుల పాత్ర పై విచారణ చేపట్టాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. వి ఆర్ ఓ పై దాడి చేసిన వైసీపీ రౌడీ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వి ఆర్ ఓ హనుమంత రావు గారికి మెరుగైన వైద్యం అందించాలి అంటూ నారా లోకేష్ అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.