రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది

Wednesday, January 27th, 2021, 01:34:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అరాచకం రాజ్యమేలుతోంది అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఓ విశ్రాంత రెవెన్యూ అధికారి భార్య గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం తో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రజా ప్రతినిధి తమ స్థలం ఆక్రమించి, అందులోకి వస్టే తమ అంతు చూస్తామని అనడం తో గుమ్మడి భారతి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారం పట్ల నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చిన స్వేచ్ఛ, హక్కులను హరిస్తున్నారు నియంత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. రాష్ట్రం లో అరాచకం రాజ్యమేలుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య తమ భూమిని కబ్జా చేసి,ప్రాణహాని ఉందని అంటూ వృద్ధురాలు భారతి గారు న్యాయం కోసం పోరాడుతున్నారు అంటే ఎంత ఘోరమైన పరిస్థతి ఉంది అర్ధం అవుతుంది అని అన్నారు. తన భర్త కష్టార్జితం తో మిర్చి యార్డు లో సమీపం లో ఉన్న భూమిని అమ్మాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి చేశారు అని నారా లోకేష్ తెలిపారు.

అయితే అమ్మడానికి అంగీకరించక పోవడం తో ఏకంగా తన భర్తను చంపడానికి యత్నించారు అంటూ భారతి గారు కన్నీటి పర్యంతమయ్యారు అని చెప్పుకొచ్చారు. దీని పై సమగ్ర విచారణ జరపాలనీ, ఎమ్మెల్యే తన అనుచరుల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.