దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి – నారా లోకేష్

Sunday, December 6th, 2020, 05:28:23 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్ఛ లక్షణాల తో పడిపోయారు అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అందులో 150 మంది అస్వస్థతకు గురయ్యారు అని తెలిపారు. అంతేకాక అందులో అధిక సంఖ్య లో చిన్నారులు ఉన్నారు అని అన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజక వర్గం లోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే ఇక రాష్ట్రం లో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్తితి తలచుకుంటేనే ఆందోళన గా ఉంది అని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే అశ్వస్తకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. కలుషిత తాగునీరు కారణం అని ప్రాథమిక సమాచారం అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలన పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.