వైసీపీ ప్రభుత్వం వ్యవహార శైలిలో మార్పు రాలేదు – నారా లోకేష్

Sunday, September 27th, 2020, 03:33:05 PM IST

Nara_lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కొత్త విగ్రహం పెడతాం అని, వెండి విగ్రహాలు పోతే నష్టం ఏంటి అని, కోటి రూపాయల రథం తగలబడితే దేవుడికి నష్టం ఎంటి అని భక్తులు మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలిలో మార్పు రాలేదు అంటూ నారా లోకేష్ వరుస విమర్శలు చేస్తున్నారు.

అయితే టెండర్లు పిలవకుండా రథ నిర్మాణం ప్రారంభించి, అంతర్వేది లో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం మాని నూతన రథ నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. రథ నిర్మాణం లో స్థానిక ఆఘ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది లో దగ్ధం అయిన రథం స్థానం లో కొత్త రథం నిర్మాణ పనులకు ఆదివారం నాడు శ్రీకారం చుట్టింది.