వారికి కటింగ్ చేశారు సీఎం జగన్ గారు – నారా లోకేష్

Wednesday, September 16th, 2020, 05:29:44 PM IST

వరల్డ్ బార్బర్స్ డే సందర్భంగా నాయీ బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. నాయీ బ్రాహ్మణ వృత్తి ఒక కళ అని, ఆ కళలో నైపుణ్యాన్ని పెంచడం కోసం గత తెలుగు దేశం హయంలో కృషి చేశాం అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సెలూన్ అంటే కేవలం జీవనాధారం కోసం అని కాకుండా, ఒక పరిశ్రమ లా ఎడగాలన్న ఆలోచన తో అవసరమైన వన్ని చేశాం అని నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే ప్రస్తుతం జగన్ పాలన లో అలాంటి పరిస్తితి లేదు అని నారా లోకేష్ ఈ మేరకు పరోక్షంగా అంటూనే ఘాటు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది అని, ఆదరణ పథకం రద్దు అయి పోయింది అని నారా లోకేష్ అన్నారు. అయిదు లక్షల రూపాయల ప్రమాద భీమా పత్తా పెడు అని, 5.50 లక్షల మందిలో కేవలం 38 వేల మందికి చేదోడు ఇచ్చి నాయీ బ్రాహ్మణుల కే సంక్షేమ కటింగ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ ప్రత్యేక సాయాన్ని ప్రకటించి బార్బర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.