ఏపీ కి వచ్చిన వివిధ కంపెనీలు, బ్రాండ్లు ఇవి – నారా లోకేష్

Friday, August 14th, 2020, 05:25:12 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వీలు చిక్కినప్పుడల్లా ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ను, పాలన విధానం పై ప్రశ్నలు సందిస్తునే ఉన్నారు. అయితే తాజాగా మరొకసారి సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్స్ వేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన మెచ్చి, ఆయన ప్రవేశ పెట్టిన ఇండస్ట్రియల్ పాలసీ నచ్చి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వివిధ కంపెనీ లు, బ్రాండ్లు ఇవి అంటూ నారా లోకేష్ లిక్కర్ సంబంధిత బ్రాండ్ లను, సీసాలను పోస్ట్ చేశారు.

నారా లోకేష్ చేసిన కామెంట్స్ కి నెటిజన్లు స్పందిస్తున్నారు. పలు రకాల సెటైర్స్ వేస్తూ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మద్యం పాలసీ విధానం పై, ఇండస్ట్రియల్ పాలసీ విధానం పై పలువురు తమ తమ రీతిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.