మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు – నారా లోకేష్!

Wednesday, August 5th, 2020, 07:03:09 PM IST

మూడు రాజధానుల నిర్ణయం పై చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం కి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సవాల్ పై స్పందించక పోవడం తో నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు మూడు రాజధానులు గురించి చెప్పకుండా, అధికారం లోకి వచ్చాక మీ స్వార్థం కోసం రహస్య అజెండా ను అమలు చేస్తామంటే అది కుదరదు అని వ్యాఖ్యానించారు.రాష్ట్ర రాజధాని నిర్ణయం అయిదు కోట్ల ఆంధ్రులు చేయాలి అని అన్నారు. మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే 3 రాజధానుల అజెండా తో ఎన్నికలకు వెళదాం అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే 48 గంటల సమయం ఇచ్చినా సవాలును స్వీకరించ లేకపోయిన పులివెందుల పిల్లులకు చంద్రబాబు గారు మరో మార్గం చెప్పారు అని వ్యాఖ్యానించారు. అయితే రాజధానుల పై ప్రజల రిఫరెండం తీసుకోండి అని మరొకసారి అన్నారు. ఇది కూడా చేయం దైర్యం లేదు అని, ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.