కక్ష సాధింపు తప్ప సీఎం జగన్ సాధించింది శూన్యం

Friday, December 4th, 2020, 10:45:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించింది శూన్యం అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ హయాంలో గ్రామాల అభివృద్ది కోసం మేము సైతం అంటూ ముందుకు వచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన వారికి చెల్లించాల్సిన 2,500 కోట్ల రూపాయల బిల్లులు ఆపి ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తక్షణమే పెండింగ్ పెట్టిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భం గా నిరసన ర్యాలీ చేపట్టారు తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు పై టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తూ పలు ప్రశ్నలు వేస్తున్నారు. అదే తరహాలో వైసీపీ నేతలు సైతం కౌంటర్ ఎటాక్ చేస్తూ వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.