జగన్ రెడ్డి అరాచక పాలనకు ఇది నిదర్శనం – నారా లోకేష్

Monday, October 26th, 2020, 12:00:19 AM IST

Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం, పాలకుర్తి లో రాజకీయ కక్షలతో జగన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అయిన హర్ష వర్ధన్ రెడ్డి బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఏ 5 ముద్దాయి అని నారా లోకేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే సీఎం జగన్ తో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోను సైతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నారా లోకేష్.

అయితే ఆయనను కేసునుండి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరించడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను అని నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికే పలు అంశాల పై నారా లోకేష్ తన గళాన్ని వినిపించారు. అయితే ఈ అంశం పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.