వరదలు…బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా?

Wednesday, October 14th, 2020, 02:16:02 AM IST


అధికార పార్టీ తీరు పై తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరోమారు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును సైతం ఎండగడుతూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయము పై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్నటువంటి సమస్యల పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి అని అన్నారు. పంటలు మునిగి పోయాయి అని, రోడ్లు చెరువులు అయ్యాయి అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జి ల పై కంప్లైంట్స్ పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజన్నా కాలు బయట పెట్టీ బాధితుల గోడు విన్నారా? వరదలు…బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ అరికట్టడం లో, రాజధానుల విషయం లో విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఢిల్లీ పర్యటన పై సైతం వరుస విమర్శలు చేస్తున్నారు.