పెన్షన్ విషయంలో జగన్ గారి మోసాలు అన్నీ ఇన్నీ కావు – లోకేష్

Friday, October 2nd, 2020, 03:00:00 AM IST

Nara_Lokesh
పెన్షన్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మోసాలు అన్నీ ఇన్ని కావు అంటూ నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. అధికారం లోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి, మాట మార్చి, మడమ తిప్పి, ప్రతి ఏడాది పెన్షన్ 250 రూపాయల పెంచుతూ పోతా అన్నారు అని, కానీ, 2500 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు అని నారా లోకేష్ విమర్శించారు.

అయితే ఇప్పటికే అవ్వా తాతలు రూ.1000 నష్టపోయారు అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అంతేకాక సంక్షేమ క్యాలెండర్ లో అవ్వా తాతల పెన్షన్ పెంపు ప్రస్తావన లేకపోవడం దారుణం అని అన్నారు. తెలుగు దేశం పార్టీ అయిదేళ్ల లో 200 రూపాయల పెన్షన్ ను 2000 కి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నేతలు వెయ్యి పెన్షన్ ని 2,250 చేశామటూ సిగ్గు వదిలి అసత్యం ప్రచారం చేస్తున్నారు అని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జూలై నుండి ఉన్న బకాయిలను చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.