అలా చేసే జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి – నారా లోకేష్

Friday, September 11th, 2020, 11:05:12 PM IST

lokesh_jagan

TNSF మాజీ అధ్యక్షుడు బ్రాహ్మం పై అక్రమ అక్రమ కేసులు పెట్టారు అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పై ఘాటు విమర్శలు చేశారు. మేము కూడా తిట్టగలం కానీ, మా పార్టీ సంస్కృతి అదికాదు అని చెప్పినందుకు బ్రహ్మం పై అక్రమ కేసులు పెట్టారు అని, అయితే అతనికి అండగా టీడీపీ పార్టీ ఉంటుంది అని నారా లోకేష్ తెలిపారు. అయితే తమ కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి అని నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు.

అయితే మరొక పోస్ట్ లో నారా లోకేష్ రాష్ట్ర మంత్రి పై వరుస ప్రశ్నలు వేశారు. అధికార పార్టీ తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంత్రి తో ప్రతి పక్ష నాయకుడిని బూతులు తిట్టించి, ఆనందపడిన జగన్ రెడ్డి గారికి, చట్టాల, మర్యాద, సంప్రదాయాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.రాజారెడ్డి రాజ్యాంగం లో బూతులు తిట్టిన నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.