సీఎం జగన్ ఇపుడేం సమాధానం చెబుతారు – నారా లోకేష్!

Monday, August 3rd, 2020, 12:00:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు సరైన చికిత్స కూడా అందడం లేదు అంటూ టీడీపీ పలు వీడియో లతో ప్రజల ముందుకు వస్తోంది. అయితే తాజాగా ఏపీ లో మరొక సంఘటన పై ఆ పార్టీ కి చెందిన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ భారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లో ఫిడేల్ వాయించుకుంటున్నారు అని విమర్శించారు. అయితే కరోనా వైరస్ పెద్ద విషయం కాదు అని, పారా సిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే విశాఖపట్నం లో విమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారి వీడియో ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్కడి పరిస్తితి నరకాన్ని తలపిస్తుంది అని, చికిత్స పొందుతున్నారు వారు గగ్గోలు పెడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రాణాలు పోతున్న పట్టించుకొనే నాథుడు లేడు అంటూ కన్నీరు పెడుతున్నారు అంటూ అవేదన వ్యక్తం చేశారు. ప్రజలను గాలికి వదిలేసి మూడు రాజధానుల సంబరాల్లో మునిగి పోయింది వైసీపీ ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు నారా లోకేష్.