జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

Sunday, May 9th, 2021, 10:09:31 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న మూర్ఖుడ్ని చూసీ రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయం అంటూ నారా లోకేష్ విమర్శించారు. ఫ్యాక్షన్ ను నమ్ముకున్న వాడు ఫ్యాక్షన్ లోనే పోతాడు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మరొకసారి గుర్తు చేస్తున్నా అంటూ నారా లోకేష్ విమర్శించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు లొంగలేదు అని, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజక వర్గం నిడ్జూరు గ్రామ టీడీపీ నేత కురవ శ్రీనివాసులు గారిని అత్యంత కిరాతంగా వైసీపీ రౌడీలు హత్య చేయించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి కొంపలో రాక్షస ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే జగన్ రెడ్డి హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే కురవ శ్రీనివాసులు అన్ని విధాలా అండగా ఉంటుంది అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.