జగన్ చేతులెత్తేశాడు అని మీ ఆకుల ఆగ్రహం గా ఉన్నారు – నారా లోకేష్

Thursday, May 6th, 2021, 02:48:52 PM IST

lokesh_jagan
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి వైసీపీ పాలనా విధానం ను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనం కాదు జగన్ నీ చేతకాని పాలనను వైసీపీ ఎంపీ లే ఎండగడుతున్నారు అని నారా లోకేష్ అన్నారు. కరోనా కట్టడికి ఏం చేయలేని నీ పనికిమాలిన పాలనను దుమ్మెత్తి పోశారు అంటూ విమర్శించారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశామని, ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రి కి చెబితే సొంత పార్టీ అని చూడకుండా కక్ష సాధింపు లకు దిగుతాడు అని భయపడి ఎవరూ నోరు మెదపట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇదిగో ఇలా వైసీపీ ప్రజా ప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతకాని పాలనను, కరోనా కట్టడి లో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

కరోనా నియంత్రణ కి జగన్ ఏం చేశాడు, బొక్క చేశాడు అంటూ పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అంటూ విమర్శించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటెన్ చేయడం లేదు, జగన్ చేతులెత్తేశాడు అంటూ ఆకుల ఆగ్రహం గా ఉన్నారు అని నారా లోకేష్ అన్నారు. అయితే శవాల దహనం కూడా చందాలు వేసుకోవాల్సి వస్తుంది అని వైసీపీ నేతలే వాపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. నేను మూర్ఖపు రెడ్డి అంటే ఉలిక్కిపడి బూతుల మంత్రి ను బూతుల తోనో, పేటీఎం బ్యాచ్ లను ఫేక్ ట్వీట్ లతో దింపుతున్నావ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్ను మీ వాళ్ళే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపు రెడ్డి అని అంటూ అందుకు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశారు.