గన్ కంటే ముందు వస్తాడు అన్న జగన్ ఎక్కడ?

Tuesday, September 1st, 2020, 03:00:29 AM IST


తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అధికార పార్టీ వైసీపీ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై వరుస ప్రశ్నలు వేస్తున్నారు. రోజుకి మూడు రేప్ లు, నెలకు 98 అకృత్యాలు, ఆరు నెలల్లో 584 అత్యాచారాలు అంటూ వచ్చిన కథనాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అంతేకాక అందులో వచ్చిన వివరాల ఆధారంగా నారా లోకేష్ వరుస ప్రశ్నలు వేశారు.

మహిళా హోమ్ మంత్రి గారు ఎక్కడ? దిశా చట్టం ఎక్కడ? గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఎక్కడ అంటూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం లో పలు చోట్ల జరుగుతున్న సంఘటన ల పై ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వీడియో ల రూపంలో అధికార పార్టీ తీరు ను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చంశనీయమ్ గా మారింది.