అమరావతిని కాపాడుకుందాం.. రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్ పిలుపు..!

Thursday, October 22nd, 2020, 06:24:15 PM IST

ఏపీ రాష్ట్ర ప్రజలంతా ఒకే తాటిపై నిలబడి రాజధాని అమరావతిని కాపాడుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. విభజనతో అన్యాయమైపోయిన ఆంధ్రులు దేశం గర్వపడే స్థాయిలో ఒక రాజధానిని కట్టుకుంటున్నారు అని చెప్పి దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందించారని అన్నారు.

అయితే నాటి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేసారని, ఐదేళ్ళ క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేదని, కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి జగన్ తమ ‘విషపునీయత’ చూపించుకున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.