బాహుబలిగా నారావారి అబ్బాయి

Friday, May 27th, 2016, 07:01:45 PM IST


ఏంటి బాహుబలికి, నారావారి అబ్బాయికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా.. ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని తెలుగు తమ్ముళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే తిరుపతి వేదికగా టీడీపీ పండుగ మహానాడు జరుగుతోంది కనుక. రాష్ట్ర నలుమూలలా ఉన్న కార్యకర్తల నుండి అధినేత స్థాయి వరకూ టీడీపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మహానాడు కోసం తిరుపతికి క్యూ కడుతున్నారు.

అలా మహానాడు సభకు వెళుతున్న అందరినీ ఓ అంశం తెగ ఆకర్షిస్తోంది. అవే ఫ్లెక్సీలు. మహానాడు సందర్బంగా తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ను బాహుబలిగా అభివర్ణించి ఏకంగా బాహుబలి ఫోటోలో ప్రభాస్ ముఖాన్ని తొలగించి ఆ ప్లేస్ లో నారా లోకేష్ తలను పెట్టి ఆయనే తమ టీడీపీ బాహుబలి అంటూ అభివర్ణించుకుంటున్నారు.