ఏం సమాధానం చెబుతారు.. వైసీపీ సర్కార్‌కి లోకేశ్ సూటి ప్రశ్న..!

Tuesday, July 14th, 2020, 01:01:17 PM IST

Jagan_Lokesh

ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలు మరువకముందే మరో సంఘటన జరిగింది. నిన్న రాత్రి రాంకీ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక సీనియర్ కెమిస్ట్ మృతి చెందారు.

అయితే ఈ ఘటనపై స్పందించిన నారా లోకేశ ట్విట్టర్ ద్వారా వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. విశాఖలో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్, ఇప్పుడు రాంకీ ప్రమాదాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.