ప్రజా కోర్ట్‌లో ఎప్పుడు క్షమాపణలు చెబుతారు.. జగన్‌కి లోకేశ్ క్వశ్చన్..!

Thursday, February 13th, 2020, 06:38:08 PM IST

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తాజాగా ఒక సూటి ప్రశ్న వేశారు. పోలవరం పనులకు సంబంధించి అసలు టీడీపీ హయాంలో ఏ మాత్రం పనులు జరగలేదని వైసీపీ ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిస్ ఈజ్ వాస్తవం అనే జగన్ గారు అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా అంటూ లోకేశ్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ప్రజా కోర్టులో జగన్ గారు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారని ప్రశ్నిస్తూ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుగారి హయాంలో పోలవరానికి పునాది పడలేదన్నారు కదా మరీ ఇప్పుడు బాబుగారి హయాంలో 58 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారని దిస్ ఈజ్ వాస్తవం అంటూ ఎద్దేవా చేశారు.